టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి

మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి
మెదక్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): మనకు న్యాయం చేయగలిగే నాయకుడు సీఎం కేసీఆర్‌ అని, తెలంగాణ తేవడమే గాకుండా  అభివృద్దితో కూడిన తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నారని మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి అన్నారు.  విూరందరూ కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. కోదండరామ్‌ పరిస్థితి కుడితిలో  పడ్డ ఎలుకలా తయారైందన్నారు. మహాకూటమి తుస్సయింది. ఇక ఆ పార్టీకి గెలుస్తామనే నమ్మకం లేదని తేటతెల్లమైందని చెప్పారు. విూరంతా బాగా ఆలోచన చేసి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న నాయకులను ఆశీర్వదించాలని  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివిధ గ్రామాల్లో ఆయన టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఇవాళ ఎవరిని అడిగినా.. ఎగిరేది గులాబీ జెండానే అంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ దీవెనలతో  కాళేశ్వరం నీళ్ల ద్వారా చెరువులు, కుంటలు నింపి ఈ ప్రాంత ప్రజల పాదాలను కడుగుతామని స్పష్టం చేశారు. రైతాంగం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిందని చెప్పారు. బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున జీవనభృతి ఇస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వచ్చాక జీవనభృతిని రూ.2016 చేస్తామని చెప్పారు. పీఎఫ్‌ కార్డు ఉన్న వారందరికీ ఈ జీవనభృతి అందిస్తామని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు ఒక్క రూపాయి అయిన ఇచ్చారా అని ప్రశ్నించారు. బీడీ కార్మికులను ఆదుకున్నది సీఎం కేసీఆర్‌ అని చెప్పారు.
ఈ ఎన్నికల్లో మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రభాకర్‌రెడ్డి కోరారు. జేపీ, మహాకూటమి అభ్యర్థులకు డిపాజిట్‌ దక్కకుండా చేసి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపాంచాలన్నారు. తెలంగాణలో మోసపూరితంతో ఏర్పాటైన మహాకూటమికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.  బీజేపీ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్నారని తెలిపారు.