టిఆర్‌ఎస్‌ మాత్రమే అభివృద్ది చేయగలదు: రామలింగారెడ్డి

సిద్దిపేట,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): నియోజకవర్గంలో ఇన్నేళ్లలో ఎప్పుడూ జరగని అభివృద్ధి కేవలం

నాలుగున్నరేండ్లలో చేసి చూపానని , మరోసారి ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలోనే అన్నిరంగాల్లో రాష్ట్రం అభివృద్ది చెందిందన్నారు. గత ప్రభుత్వాలు 60ఏండ్లలో చేయని అభివృద్ధిని నాలుగున్నరేండ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ చేసి చూపారని తెలిపారు. మహాకూటమి పేరుతో మోసపూరిత హావిూలిచ్చి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నదని ప్రజలు ఈ కూటమిని తుంగలో తొక్కాలన్నారు. తెలంగాణ ప్రజలను మరోసారి దోచుకోవడానికి వస్తున్న టీడీపీ, కాంగ్రెస్‌లను తరిమికొట్టాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. అభివృద్దిని అడ్డుకున్న కాంగ్రెస్‌ పార్టీని ముందుగా నియోజకవర్గంలో బహిష్కరించాలని పిలుపునిచ్చారు.