టిడిపివి చీప్‌ ట్రిక్స్‌: కొండా

వరంగల్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : అసెంబ్లిలో స్పీకర్‌పై ఆవిశ్వాసం పెడుతాం అని టిడిపి అనడం వారి రాజకీయ దిగజారుడు తాననికి నిదర్శనం అని ఒకవేళ వారు అవిశ్వాసం పెడితే అపార్టిపై బిసి వ్యతిరేకపార్టిగా ముద్ర పడుతుందని వరంగల్‌ తూర్పు ఎమ్మేల్యే కోండా సురేఖ అన్నారు.అలాగే వారు క్షమాపణలు చెప్పకుండా బయట నానాయీగీ చేస్తున్నారని మండిపడ్డారు.  తెలంగాణ ప్రజల అబివృద్ది కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై టిడిపి సభ్యులు సలహాలు సూచనలు ఇవ్వకుండా సభ సమయాన్ని వృధా చేసుకున్నారని అన్నారు. జాతీయగీతం విషయంలో క్షమాపణ చెప్పలేని వారు ఏం దేశభక్తులని అన్నారు. ఇప్పటికైనా వారు స్పీకర్‌పై అవిశ్వాసం పెడుతాం అంటూ వారు చేస్తున్న చిఫ్‌ ట్రిక్స్‌ను మానుకోవాలని అమె తీవ్రంగా మండిపడ్డారు. సీమాంద్రలో అబివృద్ది జరగకపోయిన అక్కడ పాలన బాగుందని అంటున్న టిటిడిపి నాయకులు సీమాంధ్రకు తోత్తులుగా వ్వవహరిస్తున్నారని అమె తెలిపారు. విూడియా పాయింట్‌ వద్ద పోలీసలుతో గొడవకు దిగడం, స్పీకర్‌ చాంబర్‌ వద్ద ఆందోళన చేయడం, గవర్నర్‌, రాష్ట్రపతిల గడప దొఓక్కడంలో ఉన్న శ్రద్ద అసెంబ్లీలో క్షమాపణలు చెప్పడానికి లేదా అని అన్నారు.