టిడిపి మహానాడులో రాజకీయ తీర్మానమే కీలకం
నాలుగేళ్ల పాలనా విజయాలపైనా చర్చ
కేంద్రరాష్ట్రాల సంబంధాలపై తీర్మానాలు
వంటకాలకు ప్రాధాన్యం
అమరావతి,మే26(జనంసాక్షి): మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వీరకు ఇదే చివరి మహానాడు. అలాగే ఇందులో రాజకీయ తీర్మానాలకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఇకపోతే నాలుగేళ్ల తెలుగు దేశం పాలనకు కడూఆ ఇది అద్దం పట్టబోతున్నది.
విజయవాడలో ఆదివారం నుంచి జరగనున్న మహానాడులో 34 కీలక తీర్మానాలు చేసేందుకు తెదేపా సమాయత్తమవుతోంది. వీటిలో ఏపీకి సంబంధించిన 22 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 8 తీర్మానాలు, ఉమ్మడి తీర్మానాలు నాలుగు ఉన్నాయి. చివరి రోజు కీలకమైన రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాజకీయాలపై ఈ మహానాడులో చర్చించనున్నారు. జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఆవశ్యకతను రాజకీయ తీర్మానంలో పొందుపరిచే అవకాశం ఉంది. రాష్ట్రం కోసం జాతీయస్థాయి రాజకీయం అనే పంథాలో ఈ తీర్మానం ఉండవచ్చని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. ఇక మహానాడు కోసం దాదాపు 2వేల మంది వలంటీర్లు కష్టపడుతున్నారు. భోజన వసతి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహానాడుకి వేల సంఖ్యలో ప్రతినిధులు తరలి వస్తున్నందున, వారి భోజనాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, సాయంత్రం స్నాక్స్ అందజేయనున్నారు. రోజూ పాతిక వేల మందికి అల్పాహారం, మూడు రోజుల్లో మొత్తం లక్షన్నర మందికి భోజనాల ఏర్పాట్లు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటలు, మిఠాయిల్ని ప్రత్యేకంగా వడ్డించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం నుంచి పూతరేకులు, తాపేశ్వరం నుంచి కాజాలు ప్రత్యేకంగా రప్పిస్తున్నారు. మహానాడు జరిగే సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో వంటలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహానాడు ప్రతినిధులకు భోజనాలు సిద్ధం చేయడానికి 400 మంది పాకశాస్త్ర నిపుణులు పనిచేయనున్నారు. వడ్డించడానికి 800 మందిని నియమించారు. పారిశుద్ధ్య పనులకు మరో 300 మందిని నియమించారు. వెయ్యి మంది కూర్చుని భోజనాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా వారికి నిలబడి తినే విధానంలో వడ్డిస్తారు. మూడు రోజుల్లో మొత్తం 15 టన్నుల బియ్యం, 5 టన్నుల కందిపప్పు వాడనున్నారు. 30 టన్నుల వంట చెరకు, 200 వరకు గ్యాస్ సిలెండర్లు వినియోగిస్తారు. 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఇష్టమైన ప్రత్యేక వంటకాల్ని అతిథులకు వడ్డించనున్నారు. పాలతాలికలు, బాదం బర్ఫీ, బొబ్బట్లు, చక్కెర పొంగలి వంటివి ఆ రోజు ఉంటాయి. వంటల జాబితాను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలోని కమిటీ సిద్ధం చేసింది. రుచులు సరిగ్గా కుదిరేలా శుక్రవారం నుంచే వాటిని కొద్దిగా వండి చూస్తున్నారు. ఆదివారం వడ్డించే రకాలన్నీ శుక్రవారం వండి, రుచి చూశారు. సోమవారం వడ్డించే వంటల రకాలన్నీ శనివారం వండనున్నట్టు శివాజీ తెలిపారు. మూడు రోజుల్లో అల్పాహారంలో, భోజనాల్లో వడ్డించే వంటల్లో పూర్ణాలు, మద్రాసు పకోడీ, కొబ్బరి అన్నం, మామిడికాయ పప్పు, దొండకాయ వేపుడు, గుత్తి వంకాయ, బీరకాయ రోటిపచ్చడి, సేమ్యా కేసరి, మిర్చి బజ్జీలు, గారెలు, పుణుగులు, ఇడ్లీలు, మైసూరు బోండాలు, గులాబ్‌జాంలు, మసాలా వడలు, చింతపండు పులి¬ర,
గుమ్మడికాయ కూర, వంకాయ బఠానీ కూర, బెండకాయ కొబ్బరి వేపుడు, వంటి అనేక రకాలున్నాయి.