టీఆర్‌ఎస్‌ను చీల్చే కుట్ర మీరు చేయలేదా?

5

– జానా..! అప్పుడెందుకు మాట్లాడలేదు

– హరీశ్‌ ఫౖౖెర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌13,(జనంసాక్షి):స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై

తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌ రావు సమాధానమిచ్చారు. మంత్రి హరీష్‌ ఆదివారం విూడియాతో మాట్లాడారు. అభివృద్ధిని చూసే ఇతర పార్టీ నేతలు టీఆర్‌ఎస్‌ లో చేరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోలేదా అని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌ లో చేరికపై ఇప్పుడు మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డి.. అప్పుడు ఎందుకు

మాట్లాడలేదో చెప్పాలన్నారు. ‘విూరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలపై మండిపడ్డారు.

టీడీపీకి క్యాడర్‌లేదు, బీజేపీకి జనాలు లేరు

హైదరాబాద్‌: వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి హరీష్‌ రావు అన్నారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని తెలిపారు. అసలు ఆ పార్టీకి సరియైన నాయకుడే లేడని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీకి క్యాడరే లేకుండా పోయిందన్నారు. బీజేపీకి జనాలు లేరని తెలిపారు. టీడీపీ ఎప్పుడో ఆంధ్రాకు వెళ్లిపోయిందన్నారు. ఇక టీఆర్‌ఎస్‌కు తిరుగేలేదన్నారు. గ్రేటర్‌లో గులాబీ జెండాను ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తమ నేత ¬ం మంత్రి నాయిని నర్సింహరెడ్డిని విమర్శించే అర్హత కాంగ్రెస్‌ నేత దానం నాగేందర్‌కు లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు నగరంలో సెటిల్‌మెంట్లు, కవిూషన్లకే పరిమితమైందని మండిపడ్డారు. ప్రజలు విూకన్నా తెలివైన వారని గుర్తించుకోవాలని హితవు పలికారు. దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరాతనని చర్చలు కూడా జరిపారని వివరించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు అందరిని కలుపుకుని పోయి తెలంగాణను సాధించామని, ఇవాళ అధికారంలో ఉండి కూడా అందరినీ కలుపుకుని బంగారు తెలంగాణ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ టీఆర్‌ఎస్‌ నేతలకు, కార్యకర్తలకు గెలుపొందామని అహంకారంలేదని, ప్రజాసేవ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. తమ నాయకుడు సీఎం కేసీఆర్‌ తమకు అదే నేర్పించారని వివరించారు. కలిసొస్తే కలుపుకుని పోతామని తెలిపారు

హైదరాబాద్‌ నగరానికి మంచినీటి కొరత ఉండదు

రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ నగరానికి మంచినీటి కొరత అంటే ఏంటో అది అంటే ఏంటో తెలియకుండా చేస్తామని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన తెలంగాణభవన్‌ లో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో గోదావరి నీళ్లను హైదరాబాద్‌కు తీసుకు వచ్చారని వివరించారు. కానీ గత సమైక్య పాలనలో సింగూరు, గండిపేట, హిమాయత్‌సాగర్‌లు ఎండిపోయి నగరంలో నీటి ఎద్దడి ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని అందజేస్తామన్నారు.