టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జోరుగా ‘గడపగడపకు తెలంగాణ’
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్ర రాజధానిలో గులాబీ దళం దుమ్మురేపుతుంది. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గడపగడపకు తెలంగాణ’ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ కార్యకర్తలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఢిల్లీ పునాదులు కదిలేలా జైతెలంగాణ నినాదాన్ని చేస్తూ నగర వీధుల్లో సర్యటింస్తున్నారు. ప్రతి వీధుల్లో ప్రజలు గులాబీ దళాన్ని గుండెలకు హత్తుకుని స్వాగతం చెబుతున్నారు. ప్రతి కార్పొరేట్ డివిజనల్ ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే పరిష్కారమని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు తెలియజెపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ పీఠానికి దిమ్మ తిరిగేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.