టీఆర్‌ఎస్ పథకాలను ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే
సిద్దిపేట,జూన్18(జనం సాక్షి): రైతును రాజును చేయాలనే సంకల్పంతో నాణ్యమైన 24 గంటల కరంట్ సరఫరా, ఎరువులు, రైతుకు పంట బీమా పథకం అందించడంతో పాటు పేద ప్రజలకు ఆసరా, ఆహార భద్రత, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు నిరుపేదలకు చేర్చడంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని అన్నారు. 70 ఏళ్ల పాలనలో ఏ ప్రభుత్వాలు కూడా చేయని అభివృద్ధి, సంక్షేమ ఫలాలను కేవలం నాలుగేళ్ల పాలనలోనే పేద ప్రజలకు అందిస్తున్నార న్నారు. పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అని అన్నారు. అలాగే తెలంగాణ ప్రభు త్వం అన్ని మతాల పట్ల సమన్యాయం చూపుతుండడంతో మతసామరస్యం వెల్లివిరుస్తోందని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పండుగలను ప్రభుత్వమే జరిపిస్తుండడంతో అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వాలు మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకుని, వారి పట్ల చిన్న చూపు చేసేవారని, తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు అధిక ప్రాధాన్యతనిస్తోం దన్నారు. ముస్లిం విద్యార్థులు చదవడానికి 120 మైనారిటీ పాఠశాలలు నెలకొల్పి ఉచిత విద్య అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌దే అన్నారు.



