టీఆర్‌ఎస్ పల్లెబాట ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు ఆ పార్టీ బుధవారం పల్లెబాట ప్రారంభించింది. ఈ పల్లెబాట తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలో కొనసాగనుంది. పల్లెబాటలో తెలంగాణవాదులు హుషారుగా పాల్గొంటున్నారు. పల్లెబాట ద్వారా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు విడమరిచి చెప్తామని పార్టీ నేతలు తెలియజేశారు. సీమాంధ్ర పార్టీలు చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
మహబూబ్‌నగర్: తలకొండపల్లి మండలం రాయిచేడులో టీఆర్‌ఎస్ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాలాజీ సింగ్ ఆధ్వర్యంలో పల్లెబాట ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ మండలం ఫతేపూర్‌లో ఇబ్రహీం, తిమ్మాజిపేట మండలం ఎదిరేపల్లిలో టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ విఠల్‌రావు ఆర్యా పల్లెబాటను ప్రారంభించారు.
వరంగల్: నల్లబెల్లి మండలం మేడిపల్లిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పల్లెబాటను ప్రారంభించారు.
కరీంనగర్: హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో పల్లెబాట ప్రారంభమైంది. వెల్గటూరు మండలం చర్లపల్లిలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, మేడిపల్లిలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, గోదావరిఖనిలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఎలగందులలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మాణరావు ప్రారంభించారు.
నల్గొండ: సూర్యాపేటలో ఎమ్మెల్యే కె. తారకరామరావు పల్లెబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్ శివ్వారంలో పల్లెబాట కార్యక్రమంలో నల్లాల ఓదేలు పాల్గొన్నారు.
రంగారెడ్డి : వికారాబాద్‌లో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎ, చంద్రశేఖర్ పల్లెబాట కార్యాక్రమాన్ని ప్రారంభించారు.
మెదక్: సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్‌రావు పల్లెబాటను ప్రారంభించారు.