టీఆర్‌ఎస్‌ భవన్‌కు బయలుదేరిన స్వామిగౌడ్‌

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో చేరనున్న తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ అధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ బంజారాహిల్స్‌లోని టీఆర్‌ఎస్‌ భవన్‌కు బయలు దేరారు. ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. రాజేంద్రనగర్‌ మండలం కిస్మత్‌పురలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసిన స్వామిగౌడ్‌ తన అనుచరులతో భవన్‌కు బయలుదేరి వెళ్లారు.