టీఆర్‌ఎస్‌ మంత్రులు..  మా సర్పంచ్‌తో సమానం


– తెలంగాణ ఇచ్చిన సోనియాను అమ్మ, బొమ్మ అంటారా?
– ప్రజలు టీఆర్‌ఎస్‌ను తరిమికొట్టేందుకు సిద్ధంకావాలి
– అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం
– కాంగ్రెస్‌ నేత రాజగోపాల్‌రెడ్డి
నల్గొండ, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌లోని ప్రతి మంత్రి, ఎమ్మెల్యేలు తమ పార్టీలోని సర్పంచ్‌తో సమానమని కాంగ్రెస్‌ నేత కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం చిట్టంపాడు గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజగోపాల్‌ రెడ్డికి సోమవారం ఘన
స్వాగతం లభించింది. ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌కి చెందిన 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. రాజగోపాల్‌ వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాను పట్టుకొని కేసీఆర్‌ అమ్మ, బోమ్మ అంటూ అవమానిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హవిూ ఇచ్చారు. రెండువేల రూపాయల పెన్షన్‌పై మొదటి సంతకం చేసేటట్లు, ఇళ్లు కట్టుకున్న వాళ్లకి రూ.5లక్షలు తక్షణమే ఇచ్చేటట్లు కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఉంటుందని రాజగోపాల్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో నాలుగేళ్ల పాలనలో కేసీఆర్‌ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని వారిని మోసం చేశారని విమర్శించారు. ప్రతి పేదవాడికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామన్న కేసీఆర్‌.. కేవలం తమ పార్టీలోకి కొంతమంది కార్యకర్తలకు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కేవలం హావిూలతోనే పాలన సాగిస్తున్నాడని, ఇచ్చిన మావిూల్లో ఏఒక్క హావిూని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని కోమటిరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ నాలుగేళ్ల మోసపూరిత పాలనతో ప్రజలు ఇసుకు చెందారని, త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

తాజావార్తలు