టీచర్ల కొరతతో విద్యార్థులకు నష్టం.
జనంసాక్షి న్యూస్ నేరడిగోండ:
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వలన విద్యార్థులు విద్యను కోల్పోతున్నారని వెంటనే వాటిని భర్తీ చేయాలని మండల సామాజిక కార్యకర్తలు యువకులు అన్నారు. శనివారం రోజున మండల విద్యాశాఖాధికారికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బడి బాట కార్యక్రమం ఆచరణలో చేపట్టడం లేదని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని ప్రచారం చేసినంత చొరవ వారికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను నియమించడలో చూపెట్టడం లేదని విమర్శించారు.వెంటనే ఉపాధ్యాయుల కొరతను తీర్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ కే బాబా సాబ్లే సంతోష్ సింగ్ రాథోడ్ రాజశేఖర్ గంగాధర్ మనోజ్ లు పాల్గొన్నారు.