టీచర్స్ కాలనీలో మహా అన్నదానం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 03(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని13 వ విజన్ దేశాయిపేట రోడ్ లో గల టీచర్స్ కాలనీ వినాయకుని విగ్రహం వద్ద శనివారం చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాదిమంది భక్తులకు స్థానిక ప్రజలకు గృహవాసులకు స్వామివారి తీర్థప్రసాదాలు, అన్నదానం అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నదాతలు గజ్జి సాయి తేజ, శాన్విక పటేల్, గజ్జి భాస్కర్, యూత్ అసోసియేషన్ సభ్యులు సునీల్, శ్రీధర్, ప్రవీణ్, హరీష్, ఆదిత్య, కన్నా, దేవ, శ్రీనివాస్, నరేష్, జయంత్, చింటూ, పుప్పాల రమేష్, గజ్జి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు