టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
రంగారెడ్డి,(జనంసాక్షి)పెద్ద అంబర్‌పేటలో రహదారి నిర్మాణ పనుల ప్రారంబోత్సవంలో ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో పనుల ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని టీడీపీ కార్యకర్తలు కూల్చివేశారు.