టీడీపీ పాదయాత్రను నిరసిస్తూ ‘ గాంధీ ‘ దీక్ష
వరంగల్: తెలంగాణలో టీడీపీ పాదయాత్రను నిరసిస్తూ టీఆర్‌ఎస్ నేత మోహన్‌గాంధీ నాయక్ జిల్లాలోని అమరవీరుల స్థూపం వద్ద దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వినయ్‌భాస్కర్, రాజయ్యలతో పాటు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణపై బాబు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణపై అఖిలపక్షంలో తమ వైఖరి చెప్తా అని బాబు అనడం గోడ మీద పిల్లివాటమే అని విమర్శించారు. బాబును తెలంగాణవాదులు అడ్డుకుంటారని చెప్పారు.