టీడీపీ మహానాడుకు హాజరైన హరికృష్ణ

హైదరాబాద్‌, జనంసాక్షి: గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఉదయం గండిపేటలో జరుగుతున్న టీడీపీ మహానాడుకు హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, బాలకృష్ణ గండిపేట మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు.