టీడీపీ సభలో తెలంగాణ మాదిగ బిడ్డలపై టీడీపీ సభ్యుల దాడి

5

– నేను అండగా ఉన్నాను

-బుల్లెట్‌లా దూసుకెళ్లండి: బాబు

మహబూబ్‌నగర్‌  ఏప్రిల్‌ 23 (జనంసాక్షి):మహబూబ్‌నగర్‌    టీడీపీ బహిరంగ సభలో మాదిగ బిడ్డలపై  టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

నాయుడు ప్రసంగించే సమయంలో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఆందోళన చేశారు. దాంతో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. సభాప్రాంగణం వద్ద  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బుల్లెట్‌లా దూసుకుని వెళ్లండి..విూకు అండగా నేనున్నాను అని టిడిపి అధ్యక్షుడు ఎపి సిఎం చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఆర్థికంగా, అన్ని విధాల అండగా ఉంటానని అన్నారు.  ఉక్కులాంటి కార్యకర్తల బలం తెదేపాకు ఉందని  చంద్రబాబు నాయుడు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించిన పార్టీ  బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఏ శక్తి కూడా తెదేపాను ఏవిూ చేయలేదన్నారు. అందరికీ న్యాయం చేయాలన్నదే తెదేపా సంకల్పమన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీ తెదేపా అని చంద్రబాబు పేర్కొన్నారు. తెదేపాను దెబ్బతీయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయన్నారు. ఎన్టీఆర్‌ ఏ ముహూర్తానా టిడిపి పెట్టారో కానీ నాయకులు పోయినా కార్యకర్తలు ఉంటున్నారని, కొత్త నాయకత్వం వస్తోందని అన్నారు. తెలంగాణ ఇవ్వాలని మొట్టమొదట చెప్పిన పార్టీ తెదేపానేనన్నారు. విభజన సమయంలో ఇరుప్రాంతాలకు న్యాయం చేయాలని తాను కోరానని, విభజన ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉండాలని కోరామని ఆయన చెప్పారు. భౌగోళికంగా విడిపోయినా మానసికంగా తెలుగువారంతా కలిసే ఉన్నారని నఅ/-నారు. అందుకే తనకు రెండు ప్రాంతాలు ముఖ్యమని అన్నారు. తెలుగువారంతా 35 ఏళ్లపాటు తెదేపాను ఆదరించారని, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టిన పార్టీ తెదేపా అని ఆయన పేర్కొన్నారు. తెదేపా హయాంలో మహబూబ్‌నగర్‌ జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేశామని చంద్రబాబు చెప్పారు.పాలమూరు జిల్లాకు రుణ పడి ఉంటానని చంద్రబాబు పేర్కొన్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. విభజన మంచి వాతావరణంలో చేయాలని సూచించడం జరిగిందని బాబు తెలిపారు. ఎన్ని వత్తిడులు వచ్చినా తెలంగాణకు మద్దతివ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఒకరిద్దరికీ ఎవరూ భయపడవద్దని, ఏ శక్తి తెలుగుదేశం పార్టీని ఏమి చేయలేదని  చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం అని, వర్షానికి..ఎండకు భయపడేది లేదని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కలిగిన ఉక్కు లాంటి కార్యకర్తలున్నారని చంద్రబాబు తెలిపారు.2019 ఎన్నికల్లో తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదే అని ఆయన అన్నారు. నేతల వలసలను ప్రస్తావించిన చంద్రబాబు ఒక్క నాయకుడు పోతే వందమందిని తయారు చేసే సత్తా టీడీపీకి ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంత అభివృద్ది, హైదారబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి, చివరకు తెలంగాణ ఏర్పాటు టిడిపి వల్లనే సాధ్యామయ్యాయని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డామన్నారు. తెలంగాణలో ఏ సమస్య వచ్చిన పరిష్కరించడానికి తామే చొరవ చూపుతున్నామని, ఇరు రాష్టాల్రు కలసి చర్చించుకుని సమస్యలు పరిస్కరించుకోవాల్సి ఉందన్నారు.  టిడిపి హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చామని,  తెలంగాణలో ఎక్కువ సాగునీరు ఇచ్చింది తెదేపా హయాంలోనేనని  చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది తెదేపానేన్నారు. మాదిగలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చింది తెదేపానేనని, వారికి న్యాయం చేయడం తెదేపా సిద్దాంతమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. వెనకబడిన వర్గాలవారిని రాజ్యాధికారంలోకి తెచ్చింది.తమ పార్టీయేనని చంద్రబాబు చెప్పారు. పేదవారి కోసం కట్టుబడి ఉన్న పార్టీ ఒక్క తెదేపానేనన్నారు. కొంతమంది నేతలు టీడీపీకి ద్రోహం చేస్తే కార్యకర్తలే పార్టీని కాపాడారని ఆయన అన్నారు. టీడీపీని విమర్శించే హక్కు ఏపార్టీకీ లేదని అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఇరు రాష్టాల్ల్రో పార్టీని కాపాడుకుంటున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణకు ఏ సమస్య వచ్చినా పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు ప్రకటించారు.  అనేక పోరాటాలు చేసిన చరిత్ర టిడిపిది అని అన్నారు.  ఇక్కడ ఆదాయం పెరిగిందటే అది టిడిపి ఘనత అని అన్నారు. అక్కడ అదికారం వచ్చింది కనుక అక్కడ ఇరవైనాలుగు గంటలు తిరుగుతూనే ఇక్కడ పార్టీని కాపాడుకుంటున్నానని అన్నారు.  కాంగ్రెస్‌ హయాంలో రాక్షసపాలన సాగిందన్నారు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని కార్యకర్తలు పార్టీకి అండగా నిలిచారని, త్యాగాలు చేసిన వారందరికి శిరస్సు వంచి వందనం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పుట్టిన పార్టీ తెదేపా అని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీని నాయకులు వీడారు తప్ప కార్యకర్తలు వీడలేదని, వారిని ఆర్థికంగా, రాజకీయంగా ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు. గురువారం పాలమూరుకు చేరుకున్న చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా పసుపుమయం అయింది. మహబూబ్‌నగర్‌ బాలుర జూనియర్‌ కాలేజీలో టీటీడీపీ ఏర్పాటు చేసిన బహిరంగసభకు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వేదికపై ఎన్టీఆర్‌ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబును పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. ఇదిలావుంటే టీడీపీ బహిరంగ సభలో  ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించే సమయంలో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఆందోళన చేశారు. దాంతో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. సభాప్రాంగణం వద్ద  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు రమణ,ఎర్రబెల్లి, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, దయాకర్‌ రెడ్డి, బక్కని నర్సింహులు, మోత్కుపల్లి తదితరులు పాల్గొన్నారు.