టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి అసంతృప్తి

ఉత్తమ్‌కు సహకరించేది లేదని స్పష్టీకరణ

నల్గొండ, మార్చి 03: తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం రాజుకుంది. పీసీసీ చీప్‌గా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ఎంపిక చేయడంపై నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఈ అంశమై ఆయన మీడియాతో మాట్లాడారు. అధిష్టానం మరోసారి తప్పుడు నిర్ణయం తీసుకుందని కోమటిరెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్‌ను ఎంపిక చేసేముందు పార్టీ నేతలను సంప్రదించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యక్రమాల వ్యవహరాల్లో ఉత్తమ్‌కు ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.