టీబి వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం అందజేత

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 1( జనంసాక్షి)
ప్రధాన మంత్రి టీబీ ముక్త అభియాన్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి నియోజక వర్గ పరిధిలోని 80 మంది టి బి వ్యాది గ్రస్తులకు 6 నెలల పాటు పౌష్ఠిక ఆహారం ఇవ్వడానికి ముందుకు వచ్చి బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి టి బి ముక్త్ అభియాన్ లో భాగంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 42 మంది టీబి వ్యాధి గ్రస్తులకు పౌష్ఠిక ఆహార సామాగ్రిని పంపిణీ చేయటం జరిగింది.
ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫిసర్ ప్రవీణ్ మాట్లాడుతూ భారతదేశంలో 2025 వరకు టి బి వ్యాధిని నిర్మూలించాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి టి బి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని, అందులో భాగంగా టి బి వ్యాదిగ్రస్తులకు ప్రతి నెలా నేరుగా 500 రూపాయలు జమ చేయటం జరుగుతుంది అంతే కాకుండా పౌష్ఠికఆహారం లోపం పోవాలనే ఉద్దేశంతో వ్యాధి ఉన్న వారికి స్థానికంగా దాత ల సహకారంతో ప్రతి నెలా వారికి పౌష్ఠిక ఆహారం అందించాలని సంకల్పించారనీ అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించునున్నట్లు తెలిపారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల భరత్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ పిలుపు మేరకు నియోజక వర్గ పరిధిలో ఉన్న మొత్తం 80 మంది టి బి వ్యాది గ్రస్థులకు 6 నెలల పాటు పౌష్ఠిక ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటీపల్లి వెంకట రమణ రెడ్డి తీసుకుంటున్నారని, రైతుల సమస్యల పై గత 9 రోజుల దీక్ష, 3 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన కారణంగా ఈ కార్యక్రమానికి రాలేకపోయారు అని, తాను రాకున్నా కార్యక్రమము ఆగవద్దు అనే ఉద్దేశం తో కార్యక్రమాన్ని వాయిదా వేయలేదని అన్నారు.