టీయూడబ్ల్యూజే(ఐజేయు) నిర్మల్ జిల్లా మహాసభలకు హాజరుకండి

 ఉద్యోగ సంఘ ఉద్యమనేత అజ్మీరా శ్యామ్ నాయక్ కు టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా శాఖ ఆహ్వానం
ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబరు 21(జనం సాక్షి): ఈనెల 23వ తేదీనా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్ లో నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా మహాసభలకు హాజరుకావాలని ఉద్యోగ సంఘ ఉద్యమనేత అజ్మీరా శ్యామ్ నాయక్ కు టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు కొండూరి రవీందర్, కార్యనిర్వాహణ అధ్యక్షులు వెంకగారి భూమయ్య సహా జిల్లా శాఖ బృందం ఆహ్వానం పలికింది. ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ ను జర్నలిస్టుల బృందం శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా మహాసభల నిర్వహణ కమిటీ సభ్యులు గాండ్ల రాజశేఖర్, రాచమల్ల రాజశేఖర్, గుమ్ముల అశోక్,పుప్పాల శేఖర్,యోగేష్, రషీద్ అలం, యేసుదాసు, సాంకేత్, రఫీ తదితరులున్నారు.