టీ జేఏసీ ఆధ్వర్యంలో పర్లపల్లిహరిత బయోప్లాంట్‌ను సందర్శించిన డాక్టర్ల బృందం
కరీనంరగర్: టీజేఏసీ కమిటీ సూచన మేరకు సోమవారం డాక్టర్ల బృందం హరితబయోప్లాంట్‌ను సందర్శించారు. పర్లపల్లి గ్రామపంచాయితీ పరిధిలో బయోప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్న పదార్థాల వల్ల వచ్చే విషవాయువుల వలన ప్రజలకు ఆనారోగ్య సమస్యలు ఏర్పడుతున్న విషయాన్ని టీ జేఏసీ ఛైర్మన్ ప్రొ||కోదండరాం సూచన మేరకు ప్లాంట్‌ను సందర్శించినట్లు జేఏసీ జిల్లా కో-ఆర్డీనేటర్ జక్కోజు వెంకటేశ్వర్లు, డా.విజయెందర్‌రెడ్డిలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఈ డాక్టర్ల బృందం పరిశీలించిన ఆంశాలను ఒక నివేధిక రూపంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ప్రొ||కోదండరాంకు అందిస్తామని , నివేధిక ఆదారంగా బయోప్లాంట్ మూసివేతకు ప్రభుత్వానికి మెమోరండం సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను మూసివేసే విధంగా టీ-జేఏసీ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. డాక్టర్ల బృందంలోని సభ్యులు డా.విజయెందర్‌రెడ్డి, డా.జగదీశ్వర్, లు మాట్లాడుతూ ఈ బయోప్లాంట్ నుంచి వచ్చే వ్యర్తపదార్థాల వల్ల దుర్వాసన వస్తుందని, ఈ ప్లాంట్ పరిసరాలలోని ప్రజలకు అనారోగ్యం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. పర్యావరణం కాలుష్యమవుతుందన్నారు. భూగర్భజలాలు విషపూరితంగా మారడంతో ఆ నీరు తాగే ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నారని వివరించారు. ఈ విషపూరిత వాయువు వల్ల ఊపిరితిత్తుల వ్యాదులు కలుగుతాయని, పిల్లలు పుట్టే అవకాశాలు కూడా దెబ్బతింటాయని అన్నారు. బయోప్లాంట్‌లో ఉత్పత్తి చేసి లాభాలు పొందడం గురించే యాజమాన్యం ఆలోచించిందని, పరిసరాల్లోని ప్రజల గురించి ఆలోచించలేదని ఆవేధన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్గందం వల్ల ఒక నిమిషం కూడా ఉండలేదని పరిస్థితి ఉందన్నారు. పక్షులు కూడా చనిపోవడాన్ని పరిశీలించామని తెలిపారు. ఒక్కడి పరిసరాల భూమి విషపూరితంగా మారాయని పంటలు కూడా పండవని వారు అన్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు ప్లాంట్ పరిసరాలను సందర్శించి ప్లాంట్‌ను మూసివేతకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ దుర్గందంలో ప్రజలు ఎలా జీవించాలో అధికారులే స్పష్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్, మోహన్‌లాల్, .కె.చంద్రబాబు, కె.సత్తిసాగర్‌రావు, టి. రాధికలు పాల్గొన్నారు.