టీ ట్వంటీ సిరీస్‌కు బాలాజీ దూరం

కర్ణాటక పేసర్‌ వినయ్‌కు పిలుపు
చెన్నై, డిసెంబర్‌ 16: ఈ నెలాఖరున ప్రారంభమయ్యే చెన్నై ఓపెన్‌కు సంబంధించిన సీడింగ్స్‌ జాబితాను నిర్వాహకులు ఇవాళ ప్రకటించారు. దీనిలో భారత యువక్రీడాకారులు సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌, యుకీ బాంబ్రీలకు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ లభించింది. ప్రపంచ టెన్నిస్‌లోని టాప్‌ ట్వంటీ ఆటగాళ్ళలో నలుగురు ప్లేయర్స్‌ ఈ టోర్నీలో ఆడుతున్నారు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన థామస్‌ బెర్డిచ్‌, జంకో టిప్సారెవిచ్‌, రెండు సార్లు చెన్నై ఓపెన్‌ గెలుచుకున్న మార్లిన్‌ సిలిక్‌తో పాటు స్టాన్లిస్‌ వావ్‌రింకా కూడా బరిలోకి దిగుతున్నారు. 2009 నుండీ ఏటీపీ వరల్డ్‌ టూర్‌లో నిలకడగా రాణిస్తోన్న సోమ్‌దేవ్‌ తన ప్రదర్శనతో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ దక్కించుకున్నాడు. గత ఏడాది చెన్నై ఓపెన్‌లో సోమ్‌దేవ్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్‌లో మూడో సీడ్‌ మార్లిన్‌ సిలిక్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. అదే టోర్నీలో మరో ఇండియన్‌ సెన్సేషన్‌ యుకీ బాంబ్రీ వరల్డ్‌ నెంబర్‌ 101 ప్లేయర్‌ కారోల్‌ బెక్‌కు షాకిచ్చాడు. గత ఏడాది ప్రదర్శనల ఆధారంగానే యుకీ, సోమ్‌దేవ్‌లకు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చినట్టు ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ కార్తి చిదంబరం చెప్పారు. 430000 డాలర్ల ప్రైజ్‌మనీ గల చెన్నై ఓపెన్‌ 1996లో ప్రారంభమైంది. ఆలిండియా టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ టోర్నీని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ప్రైజ్‌మనీ కూడా పెంచారు. డిసెంబర్‌ 31 నుండి జనవరి 6 వరకూ చెన్నై ఓపెన్‌ జరగనుంది.