టీ ట్వంటీ సీరిస్‌లో రోహిత్‌ మెరుపులు

10 ఓవర్లకే మ్యాచ్‌ ముగుస్తుందన్న సచిన్‌

సర్వత్రా కోహ్లీ సేనకు ప్రశంసలు

లండన్‌,జూలై9(జ‌నం సాక్షి): ఇంగ్లాండ్‌ గడ్డపై పరాజయ సంప్రదాయానికి తెరదించుతూ భారత్‌ ఎట్టకేలకు ఘన విజయం సాధించడం ద్వారా టీమిండియా రికార్డను సృష్టించింది. దీంతో కోహ్లీ సేనకు అభినందనుల వెల్లువెత్తాయి. రోహిత్‌ శర్మ విధ్వంసక శతకం, హార్దిక్‌ పాండ్య మెరుపులతో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. దీంతో రోహిత్‌ను కూడా అంతా అభినందనల్లో ముంచెత్తారు. అంతేగాక.. ఈ మ్యాచ్‌లో లక్ష్యఛేదనకు దిగిన భారత్‌.. 20ఓవర్లు పూర్తికాకముందే విజయాన్ని సొంతం చేసుకోవడం మరో విశేషం. దీంతో ఇంగ్లాండ్‌తో వన్డే, టెస్టులకు ముందు టీ ట్వంటీ ద్వారా 2-1తేడాతో భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌తోటీమిండియా హిట్టర్‌ రోహిత్‌శర్మ టీ20ల్లో మరో ఘనత సాధించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బ్రిస్టల్‌ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్‌ విధించిన 199 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌ మరో 8 బంతులుండ గానే 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్‌ రోహిత్‌శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి 56 బంతుల్లోనే అజేయ శతకం సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ శతకం టీ20ల్లో అతడికి మూడోది కావడం విశేషం. తద్వారా ఈ ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు సాధించిన న్యూజిలాండ్‌ ఆటగాడు కొలిన్‌ మన్రో సరసన రోహిత్‌ చేరాడు. ఇప్పటివరకు 84 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. 77 ఇన్నింగుల్లో 2086 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 15 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 118. 2015లో ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ తొలి సెంచరీ సాధించాడు. అనంతరం 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై రెండో శతకం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ, ఆసియా క్రికెటర్‌గా

భారత జట్టు విజయాన్ని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ ముందుగానే ఊహించారు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో సచిన్‌ ట్విటర్‌ వేదికగా ఓ పోల్‌ పెట్టారు. ‘ఈ మ్యాచ్‌ను భారత్‌ 19వ ఓవర్‌ పూర్తికాకముందే ముగిస్తుందని నాకు అనిపిస్తోంది. దీనికి విూరు ఒప్పుకుంటారా?’ అని సచిన్‌ పోల్‌ పెట్టారు. దీనిలో 80శాతం మంది అవును అని, 20శాతం మంది కాదు అని అభిప్రాయాలు వెల్లడించారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా 19ఓవర్లు పూర్తికాకముందే విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేయగా.. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 18.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మ్యాచ్‌ అనంతరం సచిన్‌ మరో ట్వీట్‌ చేస్తూ కోహ్లీ సేనను అభినందించారు. ‘ఈ ఇన్నింగ్స్‌ ఆద్యంతం అద్భుతంగా ఉంది. వన్డేలకు కూడా ఇలాంటి ఫామ్‌నే ప్రదర్శిస్తారని విశ్వసిస్తున్నా. నా 19వ ఓవర్‌ అంచనాలను నిజం చేసినందుకు కృతజ్ఞతలు’ అని సచిన్‌ ట్వీట్‌ చేశారు.