టీ-హబ్‌ సందర్శించిన ఇంగ్లాండ్‌ మంత్రి సాజిద్‌ జావెెద్‌

2

హైదరాబాద్‌, డిసెంబర్‌ 10(జనంసాక్షి):స్ట్రార్టప్స్‌ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గురువారం ఇంగ్లాండ్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ (బిజినెస్‌, ఇన్నోవేషన్‌, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌) మినిస్టర్‌ సాజిద్‌ జావెద్‌ హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని టీ హబ్‌ ను సందర్శించారు. మంత్రి కేటీఆర్‌ ఇంగ్లాండ్‌ మినిస్టర్‌ ను సాదరంగా ఆహ్వానించారు. టీ హబ్‌ లో స్టార్టప్స్‌ కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. స్టార్టప్స్‌ పై తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని వివరించారు. స్టార్టప్స్‌ రంగంలో ఇంగ్లాండ్‌ ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని.. ఇంగ్లాండ్‌, తెలంగాణ కలిసి పని చేసే దిశగా చర్చలు జరిపామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హెల్త్‌ కేర్‌, సైబర్‌ సెక్యూరిటీ, స్కిల్స్‌, గేమింగ్‌ అండ్‌ యానిమేషన్‌, విూడియా, డిఫెన్స్‌ రంగాల్లో ఇంగ్లాండ్‌ తో కలిసి పని చేయాలని నిర్ణయించామన్నారు. ఇక లైఫ్‌ సైన్సెస్‌ లో హైదరాబాద్‌ లో ఉన్న సదుపాయాలను పరిశీలించిన మంత్రి.. ఇంగ్లాండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ మంత్రిని పర్యటనకు పంపిస్తామని హావిూ ఇచ్చారని కేటీఆర్‌ వెల్లడించారు. ఇంగ్లాండ్‌, ఇజ్రాయెల్‌ రెండు దేశాలు కలిసి దాదాపు 30 స్టార్టప్స్‌ రన్‌ చేస్తున్నాయని, ఆ కంపెనీలు లండన్‌ స్టాక్‌ ఎక్చేంజీలో కూడా నమోదయ్యాయని కేటీఆర్‌ తెలిపారు. చిన్న దేశమైన ఇజ్రాయెల్‌ .. స్టార్టప్‌ రంగంలో దూసుకుపోతోందని ఆ దేశ స్ఫూర్తితో యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారని కేటీఆర్‌ అన్నారు. ఇంగ్లాండ్‌ కే చెందిన ఎల్‌ఈడీ మాక్‌ అనే కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. స్టార్టప్స్‌ ను మరింత ప్రోత్సహించేలా ఎంఓయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు.