టెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి

ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జిల్లాలో టెట్ పరీక్షలు సజావుగా , ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు తగు ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓ లు , ఎం ఆర్ ఓ   లు, రూట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ , డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ తో  ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12 వ తేదీ ఆదివారం ఉదయం 09. 30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2. 30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ పేపర్  పరీక్షలు నిర్వహించడం జరుగుంతుందని , ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను  పూర్తిగా నిషేధించిన్నట్లు , ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండడంతో మాస్కులు తప్పని సరిచేసిన్నట్లు ,  పరిక్షా కేంద్రాలకు  ఇతరులను అనుమతించకూడదని, ప్రతి పరీక్షా కేంద్రoలో  నిఘా ఏర్పాటు చేసిన్నట్లు, పరీక్షా కేంద్రల లో మౌలిక వసతులైన  పరిశుభ్రత, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా కు ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలని అయన అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని,  పోలీస్ శాఖ వారు పటిష్ఠ  బందోబస్తు ఏర్పాటు చేయాలనీ, జిరాక్స్ కేంద్రాలని మూసివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా వ్రాసే అభ్యర్థులు ఒక గంట ముందే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని  ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరగదని అన్నారు. అభర్ధులతో పాటు ఏ స్థాయి అధికారులకు సెల్ ఫోనులు అనుమతించబోమని ఆయన అన్నారు. జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ టెట్ పరీక్షకు ఒక రోజు ముందు సంబంధిత సెంటర్ అధికారులు తమ తమ సెంటర్లలో మౌలిఖ వసతులు పరిశీలించుకోవాలని ఏమైనా సమస్య ఉంటె సంబంధిత  అధికారికి తెలిపి పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు . ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ప్రధమ చికిత్స అందించుటకు ఏ ఎన్ ఎం లను ఏర్పాటు చేయాలని వైద్య  అధికారులను ఆదేశించారు. జడ్పీ సీఈఓ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఎటువంటి అవాoతరాలు లేకుండా టెట్ పరీక్షలు పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు అందరు సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు. ఈ అవగాహన సదస్సులో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఇంకా ఏవైనా సమస్యలు ఉంటె సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలని ఆయన అన్నారు.
జిల్లా విద్య శాఖ అధికారి నర్సింహా రావు మాట్లాడుతూ ఈ నెల 12 వ తేదీన నిర్వహించే టెట్ పరీక్షలు పేపర్-1 కు 31 సెంటర్లలో ఉదయం 9. 30 నుండి మధ్యాహ్నం 12 గంటల  వరకు 7,378 మంది అభ్యర్థులు , పేపర్-2 మధ్యాహ్నం 2. 30 నుండి సాయంత్రం 5 గంటల వరకు 6,871 మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాస్తున్నట్లు ఆయన తెలిపారు. అభర్ధులకు ఏవైనా సమస్యలు ఉంటె పరిష్కారం కోసం జిల్లా విద్య శాఖ కార్యాలయం లోని కంట్రోల్ రూమ్ ఫోన్ నెం  :: 08685  293422 , సెల్ నెం :: 9848026032 ని సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చునని పరీక్షా రాసే అభ్యర్థులను కోరారు.   ఈ అవగాహన సదస్సులో జిల్లాలోని ఎంపీడీఓ లు, ఎం ఆర్ ఓ లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.