టెన్త్‌లో మనమే ముందుండాలి

సిద్దిపేట,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): మార్చిలో జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి  జిల్లాను  మొదటి స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డిఇవో సూచించారు.  అధ్యక్షతన పదవ తరగతి పరీక్షలపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ఆయన తరచూ సవిూక్షిస్తూ లక్ష్యాలకు చేరువగా ఉండాలని సూచించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సాయంత్రం విద్యార్థులకు అల్పాహారాన్ని అందించాలన్నారు. 10 జీపీఏ పాయింట్లు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు 25 వేల నగదును అందిస్తామని ప్రకటించారన్నారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. ఈ సారి వంద శాతం ఫలితాలతో మొదటి స్థానంలో నిలుపుతామని తెలిపారు.