టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతకు ముందస్తు ప్రణాళికలు

 కలెక్టర్‌ సిత్మా సబర్వాల్‌

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిత్మా సబర్వాల్‌

కరీంనగర్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిత్మా సబర్వాల్‌
మంగళవారం కలెక్టరేటు ఆడిటోరియంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ప్రధానోపాధ్యాయాలు,మండల విద్యా ధికారులతో వచ్చే  10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధన కోసం తీసుకోవలసిన చర్యలపై సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ సంవత్సరం జరి గిన పరీక్షల్లో జిల్లా 93.38 శాతం ఉత్తీరత సాధిం చి వరసగా రెండవసారి రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలచిందని, ప్రధమ స్థానంలో నిలుపు టకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయాలు, ఉపాధ్యా యులు, మండల విద్యాధికారులను కలెక్టర్‌ అభినందించారు.

ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వచ్చే సంవత్సరం వంద శాతం ఉత్తీర్ణ సాధించాల న్నారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో ఏ ఒక్క విద్యార్ధి ఫెయిల్‌ కాకూడదని అన్నారు. వచ్చే సంవత్సరం నాణ్యమైన విద్యాప్రమాణాలతో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని సూచించారు. 10వ తరగతి స్టడీ మెటీరియల్‌ ఈ మాసంలోని అందజేస్తామని కలెక్టర్‌ తెలిపారు. వచ్చే జనవరి మాసం నుంచి విద్యార్ధులకు అల్పాహారం అందిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 10వ తర గతి విద్యార్థులకు ముందుగానే ఇంటర్‌లో తీసుకో వలసిన కోర్సులు,చదవు ప్రాముఖ్యత గురించి అవ గాహన పెంపోందించాలని సూచించారు. పాఠ శాల్లో పరిసరాలను అహ్లాదకరంగా ఉంచా లన్నారు.

సమావేశానికి హాజరైన అధికారులు, ఉపాధ్యాయులు

పాఠశాల ప్రారంభం నుంచి వైట్‌వాష్‌ చేయించి శుభ్రంగా ఉంచాలని సూచించారు పాఠశాలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తా మని, వంద శాతం ఉత్తీర్ణత సాధించే బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉందన్నారు. ఈ సమావే శంలో అదనపు జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌, జిల్లా విద్యాధికారి లింగయ్య,రాజీవ్‌ విద్యామిషన్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ గంగారెడ్డి, ఏడీ పూర్ణానందరావు జగిత్యాల, హుజూరాబాద్‌, పెద్దపల్లి, ఉప విద్యాధికారులు జగన్‌మోహన్‌ రెడ్డి, వెంకటేశ్వర్లు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.