*టైటిల్* *కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో బియ్యం బ్యాగులు విద్యార్థినులతో కాలి చేపిస్తున్న వార్డెన్*

 *సబ్ టైటిల్* *విద్యార్థినిలు బియ్యం బ్యాగులను కాలి చేసిన విషయం నిజమే అని ఒప్పుకున్నా ఏం ఈ ఓ*
 *సబ్జెక్టు* *జనంసాక్షి /సెప్టెంబర్ 03/తుర్కపల్లి మండలం/యాదాద్రి భువనగిరి జిల్లా/ఆలేరు నియోజకవర్గం*
కస్తూరి గాంధి బాలికల విద్యాలయంలో  ప్రతి బియ్యం బ్యాగును విద్యార్థులే దించాలి..
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి  మండలంలోని రాంపూర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో  బియ్యం బ్యాగులు హాస్టల్లో దించడానికి  కూలీలు అవసరం లేదు ఎందుకంటే ప్రతిసారి విద్యార్ధినులు కాలి చేస్తారు   చదువుకునే బాలికలతో శుక్రవారము బియ్యం బ్యాగులను కాలి చేపించిన వార్డెన్, టీచర్లు శుక్రవారం  జరిగింది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాంపూర్ కస్తూరిబా గాంధీ విద్యాలయం లో జరిగింది ఎంతో కష్టపడి సీటు తెచ్చుకొని విద్యార్థులు చదువుకుందాం అని వస్తారు.కానీ ఉపాద్యాయులు విద్యార్దినిల జీవితాలతో,వారి భవిష్యత్తుతో  చెలగాటం ఆడుతున్నారు  విద్యార్థుల్లగా చూడకుండా ఒక కూలీల వలె చూడడం ఎంత వరకు సమంజసం.విషయం తెలుసుకున్న  కలెక్టర్ క్రింది స్థాయి అధికారులకు వివరణ కోరగా ఎం ఈ ఓ,విద్యాలయానికి వచ్చి వివరణ చేపట్టారు
సంఘటన గురించి తెలుసుకుందాం అని వచ్చిన రాంపూర్ సర్పంచ్ రమావత్ మంజుల మహేందర్ ఒక సర్పంచ్ అని చూడకుండా గంటకు పైగా గేటు దగ్గర బయట నిలబెట్టారు . సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ పాఠశాల గురించీ ఏమైనా సమస్యలు ఉంటే సర్పంచ్ అవసరం ఉంటారు, ఇలాంటి సమయంలో అవసరం లేదా అని తెలిపారు. ఎం ఈ ఓ  విద్యార్థినిల నుండి, టీచర్ల నుండి వివరణ సేకరించిన అనంతరం పిల్లలు బ్యాగులు మోసిన విషయం వాస్తమేనని ఒప్పుకున్నారు.పై అధికారులకు వివరణ  అందజేస్తాం అని తెలిపారు.. విద్యార్థినీల తల్లితండ్రులు ఈ సంఘటన గురించి పిల్లల చేత వెట్టి చాకిరి చేపించే టీచర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు