టైర్ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్ మండలం ఎర్రగుంట్ల తండాలోని టైర్ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.