టోల్‌గేట్ వద్ద కంటెయినర్ బీభత్సం
రెండుకార్లను ఢీకొనడంతో ఒకరు మృతి
వరంగల్ సిపికి తప్పిన ముప్పు
మెదక్,ఆగస్ట్31(టోల్‌గేట్ వద్ద కంటెయినర్ బీభత్సం): కంటైనర్ బీభత్సం సృష్టించిన ఘటన తూప్రాన్ టోల్‌గేట్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. టోల్‌గేట్ వద్ద కంటైనర్ అదుపుతప్పి రెండు కార్లను ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో వరంగల్ సిపి తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని తమ బంధువుల ఇంటిలో జరిగిన శుభకార్యానికి వెళ్లి సీపీ అధికారిక వాహనంతో పాటు మరో కారులో వస్తుండగా.. మెదక్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. తూప్రాన్ సవిూపంలో జాతీయ రహదారిపై ఉన్న టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న కారును వెనుక నుంచి కంటైనర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఈ వాహనంలో ప్రయాణిస్తున్న సీపీ బంధువు అనిత చనిపోయారు. ఇదే కారులోని మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. కంటైనర్ లారీ దూసుకుపోవడంతో రెండు టోల్‌గేట్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇద్దరు టోల్ గేట్ సిబ్బంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి ముందు ఉన్న సీపీ అధికారిక వాహనం సైతం ధ్వంసమైంది. క్షతగాత్రులను హైదరాబాద్‌లోని యశోద, కిమ్స్ ఆస్పత్రులకు తరలించారు.
కంటైనర్ దూసుకెళ్లడంతో రెండు టోల్ గేట్లు ధ్వంసమయ్యాయని వెల్లడించారు.



