ట్యాంక్ బండు పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ట జీవో పై ధన్యవాదాలు*

రాష్ట్ర ప్రభుత్వానికి  ధన్యవాదాలు తెలిసిన గౌడజన గీతకార్మిక సంఘము.
పెబ్బేరు డిసెంబర్ 02 ( జనంసాక్షి ):
తెలంగాణ ప్రాంత తొలి బహుజన వీరుడు దాదాపు 35 సంవత్సరాలు తెలంగాణా ప్రాంతంలో పరిపాలన చేసిన  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని గతకొన్ని సంవత్సరాల నుండి రాష్ట్రంలోని వివిధ గౌడ సంఘంలా విజ్ఞప్తిని మన్నించి తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్  ప్రత్యేక చొరవతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, బీసీ ప్రిన్సిపల్ సెక్రెటరీ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం  కృషితో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అదేశం తో  ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ట్యాంక్ బండుపై  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రభుత్వ పరంగా జీవో విడుదల పై గౌడజన గీతకార్మిక  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సురగౌని రామన్ గౌడ్ ప్రకటన లో ధన్యవాదాలు తెలిపారు.  గౌడులచిరకాలవాంఛను  నెరవేర్చి ట్యాంక్ బండిపై విగ్రహం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
అలాగే  గోల్కొండ రాజ్యాన్ని యుద్ధంలో జైయించి ఏడునెలాలు గోల్కొండను పారిపాలించిన చరిత్రను శిలాశనం చేయాలి గోల్కొండ కోటముందు భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం

తాజావార్తలు