ట్రస్మా జిల్లా అధ్యక్షులు డా.జలెందర్ రెడ్డిని ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు

 

యాదాద్రి భువనగిరి. జనం సాక్షి తెలంగాణ రికగ్నైసేడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్( ట్రస్మా) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా జిల్లా కేంద్రానికి చెందిన విజ్ఞాన్ పాఠశాల కరేస్పాండెంట్ డా.పగిడాల జలంధర్ రెడ్డి ఎన్నికయ్యారు.
వారిని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (టిజేయూ)యాదాద్రి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా తో పాటు జిల్లా కమిటీ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు చిన్న బత్తిని మత్యాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దం ఉదయ్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త కొడరి వెంకటేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవరకొండ లావణ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.