ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి ఆయిల్‌ అపహరణ

మెదక్‌  (జ‌నంసాక్షి) :
మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో దొంగలు బరితెగించారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి విద్యుత్‌ సరఫరా నిలిపివేసి ఏకంగా 740 లీటర్ల ఆయిల్‌ను అపహరించారు. దీంతో అర్ధరాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.