*ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి*

మునగాల, సెప్టెంబర్ 21(జనంసాక్షి): ట్రాన్స్ పోర్ట్  వర్కర్స్ కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రోడ్డు ట్రాన్స్ ఫోర్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధ) సంఘం జిల్లా కార్యదర్శి ఎం రాంబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మాధవరం గ్రామంలో లారీ, ఆటో డ్రైవర్ల సమావేశం జజ్జల సంతోష్ అధ్యక్షతన సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం రాంబాబు, కొలిశెట్టి యాదగిరి రావు హాజరై మాట్లాడుతూ, సరుకులను ప్రయాణికులను రవాణా చేయటం ద్వారా ఉపాధి పొందుతున్నారని, గ్రామాలలో ఉత్పత్తి అయిన ఆహారధాన్యాలను పట్టణాలకు చేరవేసి పట్టణాలలో ఉత్పత్తి అవుతున్న వినియోగ వస్తువులను చేరవేసే కీలకమైన పాత్ర పోషించే డ్రైవర్ లకు జీవన భద్రతకి రక్షణకు సంక్షేమానికి నోచుకోలేదని, డ్రైవర్ లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, దాసరి సతీష్, జజ్జల సంతోష్, వల్లదాసు  వీరస్వామి, తంగెళ్ల మహేష్, మహంకాళి రాము, గోపాలకృష్ణ, కళ్యాణ్, తిరుపతి, నాగయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.