ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు…

-గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్..
ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు తెలుపుతున్న ట్రాఫిక్ ఎస్ఐ…
గద్వాల రూరల్ ఆగష్టు 24 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు నిత్యం విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.అలాగే గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ మరియు తన సిబ్బందితో కలిసి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రతిరోజూ తనిఖీలు చేపట్టి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ, చలాన్లు విధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే బుధవారం పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ కూడలి వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు…ట్రాఫిక్ ఇన్స్పెక్టర్  విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై మరియు ప్రయాణికుల భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో తగు సూచనలతో అవగాహన కార్యకమం నిర్వహించనైనది. ఇట్టి కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు  డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సంయమనం పాటించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని, నిర్దేశించిన వేగంతో మాత్రమే ఆటో ను నడపాలని, పట్టణ ప్రాంతాల్లో ఆటో స్టాండ్ల వద్ద మాత్రమే నిలపాలని, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించే విధంగా పార్కింగ్ చేయరాదని , ఓవర్ టేకింగ్ చేస్తున్నప్పుడు అన్ని జాగర్తలు తీసుకోవాలని, పట్టణ ప్రాంతాల్లో ఓవర్ టేకింగ్ చేయకుండా నడపాలని, కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు. ఆటో డ్రైవర్లు తమ వాహనం యొక్క సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్ లేకపోవడం, యూనిఫామ్ లేకపోవడం లాంటి 15 ఆటో లను గుర్తించి పట్టుకున్నారు. పట్టణంలో ప్యాసింజర్ ఎక్కించుకొని తిరిగి ఆటో, క్యాబ్ వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించడమే కాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ వాహనాలకు కనిపించే విధంగా నెంబర్ ప్లేట్, వాహన ధ్రువపత్రాలు ఉండాలని గత కొన్ని నెలల కింద పై అధికారుల నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేసి ముందుగా చెప్పినప్పటికీ ఆటో డ్రైవర్ ను మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుండా ఆటోలు నడిపినట్లు అయితే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ అవగాహన కల్పించి హెచ్చరించారు. ఆటోలను అద్దెకు ఇచ్చే యజమానులు తాత్కాలిక డ్రైవర్లు పై నిఘా ఉంచి పూర్తి సమాచారం ఆధార్ కార్డు,ఫోన్ నెంబర్, ఫోటో తప్పనిసరిగా ఆటో యజమాని  దగ్గర ఉండాలని ఏదైనా ప్రమాదం లేదా అక్రమ రవాణా జరిగినప్పుడు గుర్తించేందుకు వీలు ఉంటుందని సూచించారు. అలా చేయకుండా ఆటోలను అద్దెకు ఇచ్చి ఉన్నట్లయితే డ్రైవర్తో పాటు యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లుమరియు ట్రాఫిక్ సిబ్బంది రాజా శేఖర్, బలరాం పాల్గొన్నారు.