ట్రినిటి ప్రభంజనం
ఇంటర్ ద్వితీయ పరీక్షా ఫలితాల్లో ట్రినిటి విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. రాష్ట్ర స్థాయి , జిల్లా స్థాయిలో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. విద్యార్థులను శుక్రవారం వావిలాలపప్లూలోని కళాశాలలో జరిగిన కార్యక్షికమంలో విద్యా సంస్థల చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి పుష్ఫగుచ్ఛాలతో అభినందించారు. ఎంపీసీ విభాగంలో జి. శ్రీకాంత్ 987 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానం, అయేషా శిరీన్ 987 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. ఎస్.పవన్‌కుమార్ 982 మార్కులతో జిల్లాలో ద్వితీయ స్థానం సాధించాడు. ఎం. అరవింద్ 980 మార్కులు టి. నవీన 980 మార్కులు సాధించారు. ఎంఈసీ విభాగంలో ఎస్. నరేష్ 959 మార్కులు, సీఈసీ విభాగంలో పి.ప్రజ్వల 935 మార్కులు సాధించారు.