ట్రిపుల్ ఐటి లో విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి,భాజాపా నేత. రావుల రాంనాథ్
నిర్మల్ బ్యూరో, జూన్16,జనంసాక్షి,,,, గత మూడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని భాజపా రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ ఆరోపించారు . ,ట్రిపుల్ ఐటీకి గత కొన్ని సంవత్సరాల నుండి వైస్ చాన్సులర్ లేకపోవడం అదేవిధంగా ఫ్యాకల్టీ లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నదని అన్నారు. నాసిరకం భోజనం పురుగుల తో కూడిన ఆహారం కలుషితమైన నీరు సరైన వసతులు లేకపోవడం వలన విద్యార్థులు గతంలో కూడా ఆందోళన చేస్తే ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించారు కానీ సమస్యలు రోజుకింత పెరిగినాయి తప్ప వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయలేదన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అక్కడికి వెళ్లకుండా విద్యార్ధులను కలువకుండా తప్పించుకోవడం సిగ్గుచేటని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించకపోవడం అదేవిధంగా మరో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్తానని సమస్యను పక్కదారి పట్టించెందుకేననీ అన్నారు. విద్యార్థుల ఆందోళనకు బిజెపి ఏబీవీపీ ఇతర సంఘాలు మద్దతుగా వెళ్లి ఆందోళన చేస్తే పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరుగుతున్నదని , కేంద్ర ప్రభుత్వం కృషితో ట్రిపుల్ఐటీ నిర్మల్ జిల్లాకు రాగా దాన్ని నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి సమస్యలు పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది లేనిపక్షంలో విద్యార్థులు చేసే ఆందోళనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు