*డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ఎలాంటి పై రవీలు ఉండవు శిరీష లక్ష్మీనారాయణ
కోదాడ అక్టోబర్ 13(జనం సాక్షి)
కోదాడ పట్టణంలోని స్థానిక 01,04,07,10,13,16,19,22,25,27, 30,33 వార్డులో గురువారం ఏర్పాటుచేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వార్డు సభకు మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ పేద వారి సొంత ఇంటి కలను నిజం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారు అన్నారు. రాష్ట్రం లో అనేక మంది పేదరికం లో ఉండి సొంత ఇల్లు లేకుండా జీవిస్తున్నారని వారందరి సొంతింటి కలను నిజం చేసేలా మంచి నాణ్యత ప్రమాణాలతో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి అర్హులకు అందించడానికి దరఖాస్తులు స్వీకరించి వివిధ దశల్లో సర్వేలు నిర్వహించి వార్డు సభల ఆధారంగా పూర్తి పారదర్శకంగా అర్హుల జాబితాను సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సంఖ్యకంటే అర్హుల జాబితా అధికంగా ఉన్నందున ప్రజలందరి సమక్షంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పక్రియకై డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేయబడుతుందని, అందులో ప్రభుత్వ మార్గదర్శకాల రోస్టర్ పాయింట్ ప్రకారం, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మరియు దివ్యాంగుల, బీసీ, ఓసి లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ పెండెం వెంకటేశ్వర్లు, RO విజయేందర్ రెడ్డి,వార్డ్ ఆఫీసర్ రంగచారి, మరియు మునిసిపల్ అధికారులు, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Attachments area