డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వడ్డెరలకు అవకాశం కల్పించాలి
వడ్డెర కులాన్నికి నాయ్యబద్దంగా రావాల్సిన హక్కుల కోసంవడ్డెర కులానికి అందించాలని,వడ్డేర్లను బీసీ జాబితలో నుండి తొలగించి ఎస్టిజాబితాలో చేర్చాలి డిమాండ్ చేస్తూ సోమవారం మల్దకల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందజేశారు.వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ను నియమించాలి.వడ్డెర కార్పొరేషన్కు 1000 కోట్లు నిధులు ఇవ్వాలని,ప్రతి చదువుకునే వడ్డెర విద్యార్థిని,విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని ,వడ్డెర కాంట్రాక్టులకు ప్రభుత్వ పనుల్లో 20శాతం ఈఎండి లేకుండా పనులు కేటాయించాలి కోరారు.వడ్డెర్లకు బండక్వారీల పైన పూర్తి హక్కులను కల్పించాలి,వడ్డెర కార్మికులు వృత్తిలో ప్రమాదశాత్తు మరణిస్తేవారి కుటుంబానికి 20 లక్షలు రూపాయలు.గాయపడినవారికి 10 లక్షల రూపాయలు ప్రభత్వం ఎక్సేగ్రేషియా ఇవ్వాలి,వడ్డెర జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్ ప్రభుత్వం కల్పించాలి,ప్రభుత్వ నామినేట్ పదవులను వడ్డెరలకు
కేటాయించాలి,వడ్డెర కమ్యూనిటీ హాలు ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి.ఉప్పల్ భగయత్ లో ప్రభుత్వం నిర్మించబోయే వడ్డెర ఆత్మ గౌరవ భవనాన్ని మా సంఘం బలపరిచిన జెరిపట్టి సత్యనారాయణ రాజు ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేపట్టాలి.
రాష్ట్ర ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా నిర్మింస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లలో వడ్డెరులకు అవకాశం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మల్దకల్ వడ్డెర నాయకులు పాల్గొన్నారు