డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అధికారులు ఇష్టారాజ్యం

లక్కీ డ్రా లో పేరు వచ్చిన అర్హురాలు పేరు తొలగించారు

సిరిసిల్ల టౌన్ (జనంసాక్షి)

సిరిసిల్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి  సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డులకు డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక డ్రా పద్ధతిలో జరిగింది దీనికి ముందు లబ్ధిదారుల ఎంపిక 5 దపలుగా వడ పోసి చివరికి అర్హుల జాబితాను తయారుచేసి డ్రా  నిర్వహించారు అయినప్పటికీ డ్రాలో వచ్చిన వారిని కొంతమంది పై ఫిర్యాదు రావడంతో మళ్లీ ఎంక్వైరీ చేసి తొలగించారు 12వ వార్డు కు చెందిన నిరుపేద మహిళ వెల్డి మల్లన్న అనే వృద్ధురాలు ఉన్నది ఈమె కుమారుడు తో పాటు కోడలు మనవాళ్ళు కూడా ఉన్నారు వీరంతా కూడా అద్దెకు ఉంటూ నివసిస్తున్నారు అధికారులు మాత్రం ఒంటరి మహిళ అనే సాకుతో అర్హుల జాబితా నుండి తొలగించడంతో వృద్ధురాలు లబోదిబోమంటూ అధికారుల చుట్టూ తిరుగుతుంది ఇలాంటి వారికి మళ్లీ ఎంక్వైరీ చేసి డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలని స్థానికలు డిమాండ్ చేశారు