డయేరియా నివారణకు చర్యలు
మహబూబ్‌నగర్,జూన్19(జనం సాక్షి): చిన్నపిల్లల్లో డయేరియా నివారణ కోసం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు. డయేరియా మరణాలను నివారించేందుకు పోషకాహార లోపాలను గుర్తించి అవసరమైన సూచనలు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి 5 సంవత్సరాల పిల్లల ఇండ్లలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేస్తారని వివరించారు. ఎవరైనా డయేరియాతో బాధపడుతున్న పిల్లలుంటే వారికి ఓఆర్‌ఎస్‌తోపాటు, రోజుకొక జింక్ మాత్రల చొప్పున 14 రోజులకు జింక్ మాత్రలు ఇస్తారని తెలిపారు. రెండోవారంలో పోషకాహార లోపాలు న్న పిల్లలను గుర్తించి వారికి సూచనలు, సలహాలు అందజేస్తారని పేర్కొన్నారు.వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అన్ని గ్రామాల్లో తాగునీటి ట్యాంకులను శుభ్రపర్చి నీటిని క్లోరినేషన్ చేయించాలని, పైప్‌లైన్ల లీకేజీలకు మరమ్మతులు చేయించాలని అన్నారు. సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను కోరారు. ¬టళ్లలో పారిశుధ్యం సరిగ్గా ఉండేలా చూడాలని, నిల్వ ఆహార పదార్థాలను, కలుషిత పదార్థాల ను అమ్మకుండా నియంత్రించాలని, పారిశుద్ద్య కార్మికులనుపర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులను డీఎంహెచ్‌వో కోరారు. అన్ని గ్రామాల్లో డ్రైనేజీలను శుభ్రం చేసి నీరు నిల్వ లేకుండా చూసి దోమల పెరుగుదల లేకుండా చేయాలని గ్రామ సర్పంచులందరికీ ఆదేశించాలని జిల్లా పంచాయతీ అధికారికి డీఎంహెచ్‌వో సూచించారు.