డిఆర్‌ఎం ఆకస్మిక బదిలీ
విజయవాడ, ఆగస్టు 2 : విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ అనురాగ్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. బుధవారం రాత్రి ఆయనకు బదిలీ ఉత్తర్వులు రావడం అప్పటికప్పుడు రిలీవ్ చేయడం జరిగింది. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు బోగి దగ్ధం వ్యవహారమే ఈ అర్థాంతర బదిలీకి కారణమని భావిస్తున్నారు. కేవలం సంవత్సరం క్రితమే అనురాగ్ విజయవాడకు డిఎంగా వచ్చారు. ఆయనవిధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేశారు. వివాదాలేమి కూడా ఆయన దరి చేరలేదు. అయినప్పటికి గంటల వ్యవధిలో డిఆర్‌ఎం అనురాగ్‌ను బదిలీ చెయ్యడం రైల్వే వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొత్త డిఆర్‌ఎంగా వికేసింగ్ నియమితులయ్యారు.