డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి -కార్పొరేటర్ భైరబోయిన ఉమా దామోదర్ యాదవ్.
వరంగల్ ఈస్ట్, జూన్ 8(జనం సాక్షి):
వరంగల్ మహానగరంలోని 38వ డివిజన్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్ అన్నారు .బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా డివిజన్లోని విధులను పర్యటించారు.
ఖిలా వరంగల్ పెట్రోల్ పంపు, రుద్రమాంబ నగర్,మిషన్ భగీరథ పైపులైను , రిస్టోరేషన్ సమస్యలు ,డ్రైనేజ్ సమస్యలు మరియు C C రోడ్లు, మరియు స్మశాన వాటిక ల పరిశీలన అదేవిధంగా ప్రజలనుండి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి అనంతరం “”పట్టణ ప్రగతి “”నిధుల నుండి త్వరగా సమస్యలను పరీక్షకరించాలని అధికారులను కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్ అదేశించడం జరిగింది. ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగినది. మిషన్ భగీరథ వాటర్ సమస్య, శానిటేషన్ పై ప్రజలు వివరించడం జరిగినది. వెంటనే సమస్యలపై కార్పొరేటర్ అధికారులను వెంటనే సమస్య ను పరిష్కరించాలని ఆదేశించడం జరిగినది.
ఈ కార్యక్రమం లో పట్టణ ప్రగతి నోడల్ ఆఫీసర్ నరేందర్. డివిజన్ ఇంచార్జి శేఖర్, స్థానిక నాయకులు వడ్డె పెళ్లి భరత్, చెన్నూరు రవి, పాలెపు రాజు, కాసుల ప్రతాపు, పొన్నం కుమార్, గుడికందుల ధన్రాజ్ , చెన్నూరి లక్ష్మి, రావుల రాజేష్, తోటకూరి నర్సయ్య,పోశాల సారంగపాణి బొల్లం కార్తీక్, జిర్రా సురేష్, తోట రుక్మయ్య, ఆకుల చందర్, అనుమాస్ సత్యం ,బండి శోభ, మిట్టపెల్లి కృష్ణవేణి, ఇనుముల సుజాత, పిట్టా రమాదేవి, బండి కవిత, పోశాల అరుణ,పొన్నం శ్రీలత,భైరబోయిన మంజుల,గద్దల దయాకర్, జవాన్ కుమారస్వామి, లైన్మెన్ నాగరాజ్, ఎలక్రిసిటీ లైన్ మెన్ రఘు, పిఎసిఎస్ డైరెక్టర్ జూలూరి శ్రవణ్, మరియు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.