డిసిఎం బోల్తా: డ్రైవర్‌కు గాయాలు

సంగారెడ్డి,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): కొండాపూర్‌ మండలంలోని మన్సాన్పల్లి గేట్‌ సవిూపంలో డీసీఎం బోల్తా పడింది. వికారాబాద్‌ నుంచి శంకర్‌పల్లి వైపు వేగంగా వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడింది. దీంతో డ్రైవర్‌ వాహనంలోనే ఇరుక్కుపోయాడు. అతడిని వాహనం నుంచి బయటకు తీయడానికి సుమారు గంట సమయం పట్టింది. గాయాలయిన వ్యక్తిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.