డి రాజా ,బాల నరసింహ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలకు కొత్త ఊపు

సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే విజయరాములు
వనపర్తి అక్టోబర్18 (జనం సాక్షి) సిపిఐ జాతీయ మహాసభల స్ఫూర్తి ప్రజా పోరాటాలకు కొత్త ఊపు నిస్తుందని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వనపర్తి జిల్లా కార్యదర్శి కే విజయ రాములు అన్నారు మంగళవారం జాతీయ మహాసభలు రంగ రంగ వైభవంగా ముగిశాయని తెలిపారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి రాజా ,జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఉమ్మడి జిల్లా నుంచి బాల నరసింహ రెండోసారి ఎన్నికైన సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన విజయవాడ నుంచి విలేకరులతో మాట్లాడారు సిపిఐ జాతీయ రాష్ట్ర నేతలతో పాటు 17 దేశాల నుంచి జాతీయ మహాసభల్లో ప్రతినిధులు పాల్గొని ఇచ్చిన సందేశాలు ప్రతినిధుల్లో కొత్త ఉత్సాహం నింపాయని తెలిపారు ఆ స్ఫూర్తితో వనపర్తి తో పాటు ఉమ్మడి జిల్లాలో తో పాటు రంగారెడ్డి నల్గొండ జిల్లాలోని 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ బీమా కోయిల్ సాగర్ నెట్టెంపాట్ ప్రాజెక్టుల పూర్తికి పోరాడుతామన్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నత్త నడకన సాగుతోందని పాలకులపై ఒత్తిడి తెస్తామన్నారు ఇవి పూర్తయితేనే జిల్లాలో వలసలు ఆగిపోతాయన్నారు ప్రభుత్వం ఇప్పటిదాకా జిల్లా ప్రాజెక్టులపై సీత కన్ను వేచిందన్నారు కేంద్రం పాలమూరు రంగారెడ్డి డి పి ఆర్ ను కూడా పెండింగ్లో పెట్టటం దుర్మార్గమన్నారు జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులను సమన్వయం చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రాజెక్టుల పూర్తికి కదిలిస్తామన్నారు వనపర్తి జిల్లాలో చాలా భాగానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సంగం బండ ప్రాజెక్టు సాగునీరందిస్తుందని ప్రధాన కాలువలతో డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం జరగలేదన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు దృష్టి సారించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు తాగునీరు అందించేందుకు ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ పథకం పనులు కూడా జిల్లాలో పెండింగ్లో ఉన్నాయన్నారు కొన్ని గ్రామాల్లో ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసిన నీళ్లు రావడం లేదన్నారు జిల్లాలో సుమారు 6000 ఎకరాలకు పైగా పోడు భూమి ఉందని కోర్టులో ఉన్నందున పట్టాలు పెండింగ్లో పడ్డాయి అన్నారు ప్రభుత్వం చిత్తశుద్ధితో కోర్టు సమస్యను అధిగమించి రైతులకు పట్టాలు ఇవ్వాలన్నారు జిల్లాలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో జాప్యం జరుగుతుందని పంచాలని పలు గ్రామాల్లో ఇండ్లపట్టాలిచ్చిన స్థలాలు చూపలేదని చూపించాలని డిమాండ్ చేశారు జిల్లాలో పార్టీని పటిష్టం చేసి మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం చేస్తామన్నారు
Attachments area