డీఎల్‌ఎఫ్ వివరణలు అర్థసత్యాలు అబద్థాలు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: డీఎల్‌ఎఫ్‌లో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పెట్టుబడులపై ఆ కంపెనీ ఇచ్చిన వివరణలు అర్థసత్యాలు, అబద్థాలని అవినితి వ్యతిరేక ఉద్యమమకారుడు అరవింద కేజ్రీవాల్ అన్నారు. విస్తృత సమాచారాన్ని డీఎల్‌ఎఫ్ తొక్కి పెట్టిందని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరణలను సోమవారం ఇస్తామని కేజ్రీవాల్ తెలియజేశారు. వాద్రా వివరణలను స్వాగతిస్తామన్న ఆయన డీఎల్‌ఎఫ్ ఇచ్చిన వివరణకు వాద్రా కట్టుబడతారా? లేదా ఏ విధంగా స్పందిస్తారో.. వేచి చూస్తామన్నారు.