డీఎస్సీ యథాతధం: మంత్రి పార్థసారధి
హైదరాబాద్: డీఎస్సీని యధాతధంగా నిర్వహించుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చినందున షెడ్యూలు ప్రకారం ఈ నెల 26,27, 28 తేదీల్లో డీఎస్సీ రాత పరీక్ష జరుగుతుందని మంత్రి పార్థసారధి తెలియజేశారు. రాతపరీక్షకు 1874 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 4.23 లక్షలమంది అభ్యర్థులు హాజరవుతారని తెలియజేశారు.