డీవైడర్‌ను ఢీకొన్న సుమో :ఒకరి మృతి

మెదక్‌: మెదక్‌ జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లిబృందంతో వెళుతున్న టాటాసుమో డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ మృతి చెందగా సుమోలో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.