డెంగీతో బాలివుడ్ దర్శక దిగ్గజం
యశ్‌చోప్రా కన్నుమూత
ముంబాయి: బాలీవుడ్ సుప్రస్ధ్ది దర్శకుడు యశ్‌చోప్రా(80) ముంబైలోని లీలావతి ఆసుపత్రి లో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన డెంగీ వ్యాధికి గురై ఈ ఆసుపత్రిలో చేరారు. నిర్మాతగా, దర్శకునిగా, స్క్రిప్ట్ రైటర్‌గా ఖ్యాతిగాంచిన చోప్రా 1932లో పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో జన్మించారు. చిత్రసీమలో తన ఐదు దశాబ్దాల అనుభందంలో భాంగా దీవార్, త్రిశూల్, చాంద్‌నీ, సిల్‌సిలా, వీర్ జారా లాంటి ఎన్నో ఆణిము త్యాలాంటి చిత్రాలను రూపొంది ప్రేక్షకలోకాన్ని అలరించారు. ఆయన చివరిగా ‘జబ్ తక్ హై జాక్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1973లో యశ్‌రాజ్ ఫిల్మ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 50చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. 2001సంవత్సరంలో దాదాసాహెబ్‌పాల్కె అవార్డ్ అందుకున్నారు. 2005లో భారత ప్రభుత్వం చలన చిత్ర రంగానికి చేసిన సేవకు గుర్తింపుగా పద్మభూషన్‌తో సత్కరించింది. ప్రేమ కథాచిత్రాలు, యాక్షన్ డ్రామాలను తీయటంలో ఆయనకు ఆయన సాటి.