డెంగీ నుంచి రక్షణకు విద్యార్ధుల ‘యూనిఫామ్‌’ మార్చాలి:ఆజాద్‌

 

చెన్నై: డెంగీ నుంచి రక్షణ పొందాలంటే విద్యార్థులు ప్రస్తుతం ధరిస్తున్న యూనిఫామ్‌లో మార్పురావాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. చెన్నైలో దక్షిణాది రాష్రాల ఆరోగ్యమంత్రుల సదస్సుకు ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుతం ధరిస్తున్న హాఫ్‌ ప్యాంట్‌, హాప్‌ షర్టుతో డెంగీకి గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. వాటి స్థానంలో పుల్‌షర్టు, పుల్‌ప్యాంట్‌ను ధరించేలా పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులను కోరాలని తెలిపారు. కనీసం రాబోయే రెండు, మూడు నెలల వరకైన ఈ విధానం అమలయ్యేలా రాష్ట్రాలు కృషి చేయాలని ఆయన సూచించారు.