డైవర్ అభ్యర్ధులు మెడికల్ టెస్ట్‌కు హజరుకావాలి…
కమాన్‌బజార్, జనంసాక్షి : ఆంధ్రపదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఖమ్మం రిజీయన్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన 85 మంది డ్రైవర్లను ఎంపిక చేసి వెటింగ్‌లో పెట్టారు. ఈ అభ్యర్ధులు ఆరోగ్యపరీక్షలకు హజరుకావాలని ఖమ్మం రిజీయస్ సీటీఎం రామనర్సయ్య తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ….. జనవరిలో ఎంపీకైన అభ్యర్ధులకు ఏప్రిల్‌లో యాజమాన్యం నుంచి అనమతి లభించిందన్నారు. అభ్యర్ధులు వివరాలను ఖమ్మం రిజియన్ కార్యాలయం నోటీస్ బోర్టులో ఉంచినట్లు తెలిపారు. ఈ వారంలో ఎంపికైన అభ్యర్ధులు ఆర్‌ఎం కార్యాలయంలో సంప్రదించి వారు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. వీరికి మెడికల్ పరీక్షలు నిర్వహించి, రెండు నెలలు డ్రైవర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం వివిధ డిపోల్లో విధులోకి తీసుకుటామన్నారు. ఖమ్మం రిజీయనల్‌లో ఉన్న ఆరు డిపొలో డ్రైవర్ల కొరత ఉందని త్వరలోనే ఎంపికైన వారిని వివిధ డిపోల్లో ఉద్యోగాలు కేటాయించి కొరతనే భర్తీ చేస్తామన్నారు.